Mahaa Daily Exclusive

  మున్సిపల్ కార్మికుల సమస్యల పై సీఐటీయూ ధర్నా కార్మిక ప్రతినిధులతో చర్చిస్తామన్న కమిషనర్..!

Share

వరంగల్ మహా;

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పై తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) హనుమకొండ వరంగల్ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో సీఐటీయూ వరంగల్ జిల్లా కోశాధికారి సింగారపు బాబు, టీఎండబ్ల్యుఈయూ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బరుపట్ల మహేష్ ల అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు
1)4 సార్ల బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని 2) హార్టికల్చర్ మలేరియా కార్మికులకు కలెక్టర్ గెజిట్ ప్రకారం
పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలని-ESI, PF, ID నెంబర్లు ఇవ్వాలని, 4) వాటర్ సప్లై హార్టికల్చర్ కార్మికులకు (2023 లో పెరిగిన )వెయ్యి రూపాయలు అమలు చేయాలని, యూనిఫామ్స్ షూస్ దహన ఖర్చులు,10వేలు, పిపి కిట్స్, పనిముట్లు ఇవ్వాలని,5) జవాన్లకు కరీంనగర్ ఖమ్మంలో లాగా 19500 /₹ ఇవ్వాలని,6) పెంచిన డ్రైవర్ల వేతనాలను కౌన్సిల్ ఆమోదం ప్రకారం వెంటనే అమలు చేయాలని,7) కార్మికుల రీప్లేస్మెంట్ వెంటనే పూర్తి చేయాలని,8) చీపుర్లు, కొడవళ్ళు, గొడ్డళ్లు,పంజాలు, పుష్కాట్స్, చలి కోట్స్, రైన్ కోట్స్, యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చార్జీలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం వివిధ వింగ్ అధికారులతో చర్చలు చేయాలని కమిషనర్ ఆదేశాల ప్రకారం కార్మిక నాయకులతో చర్చలు చేయడం జరిగింది.
ఈ చర్చలలో కార్పొరేషన్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ మహేందర్ , చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తో పాటు మలేరియా విభాగం ఇంచార్జ్ రాజా రెడ్డి , ఎంహెచ్ఓ రాజేష్, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ లు హాజరు కాగా సిఐటియూ నాయకులు టీ ఉప్పలయ్య సింగారపు బాబు, జన్ను ప్రకాష్, బరపట్ల మహేష్ యాస బాబు, కార్మికులు హాజరై డిమాండ్ల పరిష్కారం పై చర్చించడం జరిగింది. 8 డిమాండ్లల్లో మెజార్టీ డిమాండ్లను సంబంధిత వింగ్ అధికారులు కమిషనర్ తో చర్చించి పరిష్కరిస్తామని, వింగ్ అధికారుల పరిధిలో లేని సమస్యలను కమిషనర్ తో చర్చించాలని తెలిపారు.
ఈ సందర్భంగా
నగర కమిషనర్ సిఐటియూ కార్మిక యూనియన్ తో చివరి గా చర్చించి, న్యాయమైన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల మరో పెద్ద ఉద్యమానికి, పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Latest