Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవుల సందడి..!

Share

కాటారం, మహా :
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి సారించింది. మంథని నియోజకవర్గంలోని మండల స్థాయిలో కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాలను నిర్వహించారు. మండల,గ్రామస్థాయి కార్యవర్గాల ఎంపిక కోసం జూన్ 30వ తేదీ లోపు ఆశావాహుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, ఇన్చార్జిలను నియమించగా క్షేత్రస్థాయిలో నివేదికను తయారు చేశారు. ఐటీ శాఖ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కాటారం, మలహర్ మండలాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో మండల శాఖ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహులు నామినేషన్ వేశారు. గ్రామస్థాయిలో పదవుల కోసం పోటీలేని చోట కార్యవర్గాల ఎంపిక పూర్తి చేశారు. మంథని నియోజకవర్గంలో మండల స్థాయి కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం అంతట తీవ్ర పోటీ నెలకొంది. బ్లాక్ మండల గ్రామ స్థాయిలో పదవుల కోసం మూడుసార్లు పనిచేసిన నాయకులు ఆ పదవులలో మళ్లీ పోటీ చేసే అవకాశం లేదు. ఫలితంగా అన్ని పదవులలో ఈసారి అందరూ కొత్త నాయకులే పదవులు చేపట్టే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు వారికి సవాల్ గా ఉన్నాయి. ఈ నెలలోనే పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవులను ప్రకటించే అవకాశం ఉంది. ఆశావాహులైన కార్యకర్తలు, నాయకులు తమకు కావలసిన పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రాష్ట్ర కమిటీ లో మంథని కి ప్రాధాన్యం

కాంగ్రెస్ రాష్ట్ర కమిటీకి నియమించిన కార్యవర్గంలో మంథని నియోజకవర్గం నుండి ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహోదరుడు శ్రీపాదరావు ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు నుప్రధాన కార్యదర్శిగా నియమించారు. సంస్థ గత ఎన్నికలలో భాగంగా శ్రీనుబాబు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా గాలి అనిల్ కుమార్ అతనితోపాటు ప్రధాన కార్యదర్శులు మల్లాడి రామ్ రెడ్డి కాశి పాక రాజేష్, రహ్మత్ హుస్సేన్ లను నియమించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దుద్దిల్ల శ్రీనుబాబును వరంగల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారు.

Latest