AP: రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 60 శాతం పూర్తి చేశామని, మిగిలిన పనులు 3, 4 నెలల్లో పూర్తి కానున్నాయని వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు, సబ్ జైలు భవనాన్నిఅనిత ప్రారంభించారు.
Post Views: 71








