AP: ఆత్మకూరు పర్యటనలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి ఏరాసుతో కలిసి ఎంపీ శబరి పర్యటించగా.. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని ఎంపీ శబరిని ప్రశ్నించారు. ఎంపీగా తనకు ఏ నియోజకవర్గంలోనైనా పర్యటించే హక్కు ఉందని శబరి అనడంతో వివాదం మరింత ముదిరింది. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
Post Views: 86







