వివిధ వ్యాధులతో వచ్చే పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు నాణ్యమైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.
శుక్రవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు..
ఆసుపత్రి లో ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ వార్డు లను ఆయన పరిశీలించారు.ఆసుపత్రి లోని అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంత మంది సిబ్బంది విధులకు హాజరయ్యారని అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపి రిజిస్టర్ ని చెక్ చేశారు. ప్రతి రోజూ ఆసుపత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందుబాటులో ఉండి.. వైద్యం కోసం వచ్చిన వారికి సకాలంలో స్పందించి వైద్యం అందించారు అన్నారు. ఆసుపత్రికి ఎంత మంది
గర్భిణి స్త్రీలు వస్తున్నారని, ఎంత మంది చెకప్ చేసుకుంటున్నారని, వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఫార్మసీలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు.
ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ల్యాబ్ టెక్నీషియన్ సుగుణ రాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది.








