ఆదిలాబాద్, మహా
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న చేపట్టిన దేశ వ్యాప్త, గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకరాఘవులు అన్నారు. శుక్రవారం సీపీఎం పార్టీ కార్యాలయంలో ప్రజా, కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి సమ్మె జయప్రదంపై చర్చించారు.. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను కుదించి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా నాలుగు కోడ్లుగా చేశారన్నారు. దీని కారణంగా కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కును కోల్పోతారన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం నిర్ణయాలు కార్పొరేట్ చేతుల్లోకి వెల్లిపోతుందన్నారు. కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్న నాలుగు కోడ్లను రద్దు చేయాలని ఈనెల 9న చేపట్టే సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.ప్రజా, కార్మిక, రైతు సంఘాల నాయకులు బండి దత్తాత్రి,కిరణ్, దేవేందర్, జగన్ సింగ్, దర్శనాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.








