Mahaa Daily Exclusive

  విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..!

Share

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే), తమిళ అగ్ర నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి తాత్కాలికంగా తన సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఆయన సొంత రాష్ట్రమైన బీహార్ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ‘జన్ స్వరాజ్’ పార్టీని పోటీకి నిలుపుతుండటంతో ఆ పనుల్లో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మళ్లీ టీవీకేకు సలహాలు ఇస్తారని సమాచారం.