మంచిర్యాల, మహా : చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోకనే ప్రతిపక్షాలు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద వాక్యానించారు. ఆదివారం
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని అంతర్గత రోడ్లు మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు గత కొన్ని నెలలుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం కొత్త బస్టాండ్ ఆవరణలో ఐదు కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.







