ఆదిలాబాద్, మహా:
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభించబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆదివారం సందర్శించారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను స్థానిక నాయకులు, ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట నాయకులు గిమ్మ సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్, పార్టీ సీనియర్ నాయకులు రామ్ రెడ్డి, సుధాం రెడ్డి, రాజా రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నైతాం సీతారాం, కన్య రాజు, ప్రభాకర్ తదితరులున్నారు.
Post Views: 92







