వరంగల్ మహా
వరంగల్ నగరంలోని కరీమాబాద్, రంగసా యిపేట, ఓ సిటీ, ఉరుసు ప్రాంతాలలోని బీరన్న దేవాలయాల్లో ఆదివారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా అంగరంగ వైభవంగా బీరన్న బోనాల జాతర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల జాతర కురుమ కులస్తులకు ఇలవేల్పు అయిన బిరన్న స్వామికి తొలి ఏకాదశి రోజునే స్వామివారికి బోనాల జాతరను నిర్వహించు కుంటారు. బోనాల జాతరకు జిల్లాల నుంచి ప్రజలు కరీమాబాద్ కు తండోప తండాలుగా విచ్చేసి గావు పట్టే కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి బోనం ఎత్తుకోవడంతో
కమిటీ వారు బోనాలను ఇంటి నుండి వీధుల గుండా కురుమ కళాకారులు డిల్లెం బల్లెం డోలుతో విన్యాసాలు చేస్తూ డాన్సులు చేస్తూ తీసుకుంటూ ఒక దిక్కు చేరుకొని కురుమ ఒగ్గు పూజారులు డోలు కళాకారులు వేషధారణలతో డాన్సులు ఖడ్గాలతో విన్యాసాలు చేస్తూ బోనాలను ఆలయానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల జాతరకు ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగరంలోని దేవాలయాల దగ్గర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దేవస్థానాల కమిటీ కరీమాబాద్ ఆలయ కమిటీ అధ్యక్షుడు కోరే కృష్ణ, ఉరుసు ఆలయ కమిటీ చైర్మన్ మరుపల్లి రవి, ఓ సిటీ ఆలయ అధ్యక్షు డు కంచ సంపత్, కార్యదర్శులు పూజారులు పాల్గొన్నారు.
బోనాల జాతరకు మూడు పార్టీల నేతలు
ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన బీరన్న బోనాల జాతరకు ఇటు అధికార పార్టీ మంత్రి కొండా సురేఖ మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు, నాయకులు పాల్గొనే సరికి కొంత ఉధృక్త వాతావరణం నెలకొంది. జాతర జరిగే ప్రాంతాల్లో మూడు పార్టీల నేతల ఫ్లెక్సీల తో బీరన్న జాతర రాజకీయ రంగు సంతరించుకుంది. బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, తో పాటు వారి అనుచర వర్గం, అలాగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో కలిసి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు బోనం ఎత్తుకొని స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకోగా ఇటు నాయకులు, కార్యకర్తలు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.







