Mahaa Daily Exclusive

  దేశ సమగ్రతకు తన ప్రాణాలు అర్పించిన మహానేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ..!

Share

వరంగల్ మహా;

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 124వ జయంతి ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు క్యాంపు కార్యాలయం నందు బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశ సమగ్రతకు తన ప్రాణాలు అర్పించిన మహానేత అని ఏక్ దేశ్, ఏక్ నిషాన్, ఏక్ విధాన్’ నినాదంతో కశ్మీర్‌ లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి చేసిన పోరాటం చారిత్రాత్మకంగా నిలిచిపోయిందని ఆయన త్యాగాలు ఈరోజు యువతకి ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు సిద్ధం నరేష్, కర్నే రవీందర్, మండల అధ్యక్షులు బోరిగం నాగరాజు, జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కొమకుల నాగరాజు, బిజెపి నాయకులు మడిపల్లి నాగరాజు, నవీన్ బీమ్, చిమ్మని శ్రీకాంత్, బస్కుల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.