ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ డ్రోన్ దాడి చేసింది. సోమవారం రాత్రి 100కు పైగా డ్రోన్లతో జరిగిన ఈ దాడిలో 11 మంది మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. నివాస ప్రాంతాలనే లక్ష్యంగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. గత వారం రోజుల్లో రష్యా సుమారు 1,270 డ్రోన్లు, 39 మిసైళ్లు, 1,000కుపైగా గ్లైడ్ బాంబులు వదిలినట్టు వెల్లడించారు.
Post Views: 112








