AP: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనితో పాటు ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ వైపు కదులుతుందని చెప్పింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్నమూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.
Post Views: 75








