తిరుమలాయపాలెం, మహా:
మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గోవింద సురేష్ మాదిగ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గోవింద సురేష్ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా అన్ని అణగారిన కులాల సంక్షేమం కోసం కృషి చేసింది అని అన్నారు. అందులో భాగంగానే ఆరోగ్య శ్రీ, ఆసరా పెంక్షనులు, రేషన్ బియ్యం పెంపు, తెలంగాణ అమరుల ఉద్యోగాలు , మహిళల కోసం పాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలైనవి ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించింది అని అన్నారు.ఈ ఫలితాలు అన్ని వర్గాలు పొందుతున్నారు అని అన్నారు. అందువల్ల సమస్త అణగారిన కులాలకు కేంద్ర బిందువుగా ఎమ్మార్పీఎస్ నిలుస్తుంది అని అన్నారు.
మూడు దశాబ్దాలుగా ఏ బి సి డి వర్గీకరణ కోసం పోరాటం చేసి ఏబీసీడీ వర్గీకరణ సాధించాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కొమ్ము రమేష్ కళాబృందం ఆటపాట కళాకారులు పెద్దపాక విజయ్ గంట వీరభద్రం తిరపయ్య, సుధాకర్ ఆటపాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నల్లమల్ల ప్రతాప్, బత్తుల రాధాకృష్ణ, బెల్లం రమేష్,గద్దల సుధాకర్, పోలేపొంగు నరసింహారావు, కుమ్మరి కుంట్ల నాగరాజు, టేకుమట్ల బాబు,పోలేపొంగు ఉపేందర్, ఎమ్మార్పీఎస్ ఎర్రగడ్డ గ్రామ శాఖ అధ్యక్షుడు ధరమళ్ళ వెంకటేశ్వర్లు, గోవింద సుధాకర్, గోవింద అన్వేష్,చిర్రా నవీన్, గంట కృష్ణ, గుగ్గిళ్ళ అశోక్, పోలేపొంగు వెంకన్న, గద్దల సురేష్, గంట వీరభద్రం, గంట వీరయ్య, వేమూరి అచ్చయ్య, ఇసు మధు, గోవింద బన్ను,గోవింద సాగర్, వినోద్ వేమూరి సందీప్, గుగ్గిళ్ళ నాగేష్, వంగూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు








