ఆదిలాబాద్, మహా
ప్రభుత్వాలు మహిళల సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ కు వచ్చిన ఆమె ఐద్వా నాయకులతో కలిసి సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు భద్రత కల్పించాలని, మగవారితో సమానంగా సమాన పనికి సమాన వేతనం అందించాలని తెలిపారు. ఉపాధి కూలి రేట్లు పెంచి రైతులకు గిట్టుబాకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు మంజుల, జిల్లా కార్యదర్శి లంక జమున, అధ్యక్షురాలు కోవే శకుంతల, లలిత, పొచ్చక్క, విద్య, మీనాక్షి, ఇర్ఫాన, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24







