Mahaa Daily Exclusive

  ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు రక్షణకు చర్యలు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా : ప్రకృతి వైపరీత్యాలపై గోదావరి నది తీర ప్రాంత ప్రజలకు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స, వేమనపల్లి మండలం రాచర్ల గ్రామాలలో భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరద పరిస్థితులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు మహారాష్ట్రలో విస్తారంగా కారణంగా ప్రాణహిత గోదావరి నీరు విస్తృతంగా ప్రవహిస్తుందని చెప్పారు. భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడే వరదలు, విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు, ఆస్తులు నష్టపోకుండా సత్వరమే సేవలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎవరికి నష్టం కలగకుండా ఉండేందుకు మంచిర్యాల జిల్లా కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వరదలు, విపత్తులు సంభవించినప్పుడు సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ నం.08736- 250501 లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలు సైతం వినియోగదారులు ఈ నెంబర్ ను సంప్రదించారని పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లుకు సంబంధించిన డాక్యుమెంట్లను వాట్సాప్ నంబర్ 9492120078 కు పంపించాలని తెలిపారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు.

Latest