Mahaa Daily Exclusive

  ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం ..!

Share

మందమర్రి, మహా : ప్రపంచ జనాభా దినోత్సవం మందమర్రి పట్టణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృపా బాయ్, డాక్టర్ ఎస్ అనిత, ఒక్క వెంకటేశ్వర్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జూలై 11 నాడు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.
జనాభా వృద్ధి వలన కలిగే సవాళ్ల, అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో జనసాంద్రత రేటు గణనీయంగా తగ్గింది అని అన్నారు. ఈ సంవత్సరం భారత జనాభా గణనీయంగా తగ్గిందని అన్నారు. విద్య ఉపాధి అవకాశాల వల్ల స్త్రీలకు వయస్సు పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా గర్భనిరోధక సాధనాలు పెరగడం వల్ల కూడా జనాభా పెరుగుదల తగ్గిందని వాక్యానించారు. నా మాట కేంద్రం ఏర్పాటు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పైన గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించడంతో కూడా జన సాంద్రత తగ్గిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రపంచ జనాభా తగ్గుదల దినోత్సవం సందర్భంగా మందమర్రి పాత బస్టాండ్ జాతీయ రహదారిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Latest