Mahaa Daily Exclusive

  జిల్లాలో నేటితో మొదలు కానున్న బోనాలు జిల్లాలో ముస్తాబైన అమ్మవారి ఆలయాలు మంఖాలలో ఎత్తనున్న మొదటి బోనం అంగరంగ వైభవంగా మహంకాళి బోనాల జాతర ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బోనాల పండుగ. రాష్ట్రంలో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ బోనాల పండుగ. గత నెలలో గోల్కొండ బోనాలతో సురువైన బోనాలు. సికింద్రాబాద్ లస్కర్ మహంకాళి బోనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా బోనాల పండుగకు ప్రభుత్వం నిధులు వెచ్చించి ప్రజల గౌరవాన్ని పెంచేలా, రాష్ట్రవ్యాప్తంగా బోనాలను ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.

నేడు రంగారెడ్డి జిల్లాలో మొదలు కానున్నాయి
బోనాల పండుగ సందర్భంగా జిల్లాలోని మహంకాళి అమ్మవారి ఆలయాలు విద్యుత్ కాంతులతో, రంగులతో, మామిడాకుల తోరణాలతో ముస్తాబయ్యాయి. శివసత్తుల శిగాలతో, పోతురాజుల ఆటలతో, బోనమెత్తిన ఆడపడుచులు అందరూ కలిసిమెలిసి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించడం జరుగుతుంది.

లస్కర్ బోనాల తర్వాత, మంఖాల మహంకాళి బోనాలు…
లస్కర్ బోనాల తర్వాత అంతటి ప్రాముఖ్యత గాంచిన మంఖాల గ్రామంలోని బోనాల పండుగ ప్రసిద్ధి చెందింది. ఆనాటి ఆనవాయితీగా లస్కర్ మహంకాళి బోనాల తర్వాత మొదలయ్యేది, రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మంఖాల గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ మహంకాళి దేవి బోనాల జాతర. మంఖాల గ్రామంలోని మహంకాళి అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని స్థానికులు చెబుతుంటారు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిర్వహించే ఈ బోనాల జాతరకు, గ్రామం నుంచే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ఆడపడుచులు, అమ్మవారికి బోనాలను సమర్పించి వాళ్ళ మొక్కలు చెల్లించి, అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలోని శంషాబాద్ ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, ఆమనగల్ ప్రాంతాలలో మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.

Latest