ఖమ్మం, జులై 12, మహా:
ప్రభుత్వ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయింది అని, ప్రజల్లో వ్యతిరేకత వుంది అని, రాబోయే కాలంలో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. శనివారం సిపిఎం ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్ కమిటీల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగబోయే రాజకీయ శిక్షణా తరగతులు పార్టీ జిల్లా ఆఫీస్ లో ప్రారంభం అయ్యాయి. ముందుగా పార్టీ జెండాను జిల్లా సీనియర్ నాయకుడు ఏ.సుబ్రహ్మణ్యం కుమార్ ఆవిష్కరణ చేశారు ఈ క్లాసులకి ప్రిన్సిపాల్ గా సీపీఎం పార్టీ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్ వ్యవహరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చేముందు స్విసు బ్యాంకులో ఉన్న నల్ల డబ్బులు వెలికి తీసి ప్రజల ఖాతాలలో ఒక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పాడు అంతేకాకుండా నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఆయన చెప్పిన ప్రకారం ఇప్పటివరకు 22 కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కేంద్రం నోటిఫికేషన్లో ఒక్కటి కూడా పడలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆరు గ్యారెంటీ ల పేరుతోటి హామీలు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలోవిఫలం మయ్యాడు. అని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2000 పెన్షన్ను 4000 రూపాయలు పెంచుతానని పెంచలేదు. అని విమర్శించారు కొత్తరేషన్ కార్డు ఇస్తానని అవి కూడా ఇవ్వలేదు. మహిళలకు 2500 రూపాయలు చొప్పున నెలకు ఇస్తానని చెప్పడం జరిగింది. డబల్ బెడ్ రూమ్ ఇల్లులు, ఐదు లక్షల రూపాయల లోను, ఇళ్ల స్థలాలు లేనివారికి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పడం జరిగింది అని ఇలాంటి ముఖ్యమైన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అని విమర్శిస్తున్నారు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలను అమలు చేసే వరకు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. అనంతరం మధ్యాహ్నం క్లాస్ ను పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్ బోధించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, పార్టీ వన్ టౌన్ కార్యదర్శి ఎస్ కె. నాగులు మీరా, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, బేగం, భద్రం తదితరులు పాల్గొన్నారు








