తిరుమలాయపాలెం, జులై 12, మహా:
20 గ్రామాలకు పరిపాలన సౌలభ్యం కోసం బచ్చోడు గ్రామం సెంటర్ గా ఉన్నందున బచ్చోడు గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కు శనివారం తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
గత పది సంవత్సరాల గా నుండి ప్రతిపక్ష నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, కలెక్టర్లకు, ప్రభుత్వ అధికారులకు ఎన్నో మార్లు బచ్చోడు గ్రామాన్ని నూతన మండల కేంద్రం చేయాలని వినతి పత్రాలు ఇచ్చిన కూడా ఫలితం లేకుండా పోయినది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా చిన్న మండలాలు, చిన్న జిల్లాలు ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం అందుబాటులో ఉండాలని చేసినారు కానీ బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రం చేయడానికి పాలకులు సవతి తల్లి ప్రేమ చూపిచ్చటం బాధాకరంగా ఉందని అఖిలపక్ష నాయకులు ఆవేదన చెందారు.
ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చించి బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని ఈరోజు ఎమ్మెల్యే సాంబశివరావు వినతిపత్రంలో 40 గ్రామాల పరిస్థితి వివరించి 20 గ్రామాలను సెంటర్గా ఉన్న బచ్చోడు గ్రామాల్లో కలిపి మండల కేంద్రం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరినారు.
ఎమ్మెల్యే సాంబశివరావు గారు స్పందించి తప్పకుండా బచ్చోడు గ్రామం మండలం కోసం స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రితో మాట్లాడి మండల అయే విధంగా ఏర్పాటు చేస్తానని సాంబశివరావు అన్నారని అఖిలపక్ష నాయకులు గుర్తు చేశారు.
ఎమ్మెల్యే ని కలిసిన వారిలో తిమ్మిడి హనుమంతరావు, రేపాకుల శివలింగం, సోమనపల్లి వెంకటేశ్వర్లు, అంగిరేకుల నరసయ్య, గొర్రెపాటి రమేష్, గుజ్జ రామకృష్ణ, బత్తుల రాధాకృష్ణ, దంతాల బాలరాజు, తాటికొండ అనంత చారి, గొర్రెపాటి వీరస్వామి, దీకొండ అరయ్యా, తదితరులు.








