Mahaa Daily Exclusive

  పేద ప్రజల తరఫున నిరంతర పోరాటం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ..!

Share

తిరుమలాయపాలెం,మహా:

పేద ప్రజల తరపున కమ్యూనిజం నిరంతరం పోరాటం చేస్తుందని, కమ్యూనిజనికి అంతం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కునంనేని సాంబశివరావు అన్నారు. సుమారు వంద సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లోని కాన్ పూర్ లో 1924లో పురుడు పోసుకున్న కమ్యూనిజం వంద సంవత్సరాలు గడుస్తున్న సజీవంగా పేద ప్రజల తరఫున పోరాడుతూ పాలకు ప్రభుత్వాలను కనువిప్పు కలిగిస్తూ ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు సిపిఐ పార్టీ అని ఆయన అన్నారు. మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో జరిగిన సిపిఐ పార్టీ తిరుమలాయపాలెం మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మొదట పార్టీ జెండాను ఆవిష్కరించి సీనియర్ నాయకులు స్వాతంత్ర సమరయోధులు సాయుధ తెలంగాణ పోరాట యోధులు చావా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జరిగిన మండల మహాసభలో సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దంతాల బాలరాజు అధ్యక్షతనలో ఆయన మాట్లాడుతూ ఈ సృష్టిలో మానవ మనుగడ ఉన్నంతవరకు కమ్యూనిజం సజీవంగా ఉంటుందని కమ్యూనిజానికి అంతం లేదని ప్రపంచ దేశాల్లో వందల సంవత్సరాలు సజీవంగా ఉన్న పార్టీ కమ్యూనిజం అని కమ్యూనిజం భావాలు కలిగిన వ్యక్తి తుది శ్వాస వరకు కమ్యూనిజం కోసం పోరాడుతాడని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ప్రశ్నించే గొంతుక కమ్యూనిజం అని ఆయన తెలిపారు. బూర్జవ పార్టీలు ఎంత తొందరగా పుట్టుకొస్తాయో అంతే విధంగా అంతరించిపోతాయని భారత దేశంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చిన అన్ని పార్టీలు అంతరించి పోయిన నిలకడగా ఉంది కమ్యూనిజం అని అన్నారు. ఈ ప్రాంతంలో కొక్కిరేణి గ్రామానికి చెందిన చావా వెంకటేశ్వరరావు సాయుధ తెలంగాణ పోరాటంలో విరోచితంగా పోరాడి పేద ప్రజల పక్షాన నిలబడి దొరలాధీనంలో ఉన్న వందల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత ఆయనకు ఉంటుందని పేద ప్రజల ఆశయ సాధన కోసం ఆయన ఎంతో కృషి చేశారని భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన ఎంతో పోరాడి దున్నేవాడికి భూమి కావాలని పోరాడి తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడారు అని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. తిరుమలాయపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూతన కమిటీ 30 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బత్తుల రాధాకృష్ణ, సహాయ కార్యదర్శిగా చీమ రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యు మహమ్మద్ మౌలానా, జిల్లా కమిటీ సమితి సభ్యులు దండి సురేష్, పగిళ్ల వీరభద్రం, దంతాల బాలరాజు, బత్తుల రాధాకృష్ణ, చావా వెంకట్రావు, సోమనపల్లి కమలమ్మ, చీమ రామకృష్ణ, మల్లేపల్లి జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Latest