TG: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆసోది కురుమయ్య(59) ఈ నెల 10న చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈ నెల 11న వనపర్తి జిల్లాలోని స్వగ్రామంలో నిర్వహించారు. మరోపక్క కల్తీ కల్లు బాధితులెవరూ తమ ఆస్పత్రిలో చనిపోలేదని నిమ్స్ వర్గాలు చెబుతుండడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Post Views: 13








