AP: మాజీ మంత్రి పేర్ని నాని వీడియోతో వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గుడివాడలో సభ పేరుతో కులాల మధ్య అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయటం సిగ్గుచేటని రవీంద్ర అన్నారు. గుడివాడలో ఘర్షణలు పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు మంత్రి చెప్పారు.
Post Views: 18








