చిగురుమామిడి మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలతో శ్రీ పోచమ్మ తల్లి గుడికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రజలు తమకు వ్యాధులు, ఆపదలు రాకుండా కాపాడినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా చల్లగా చూడమని వేడుకున్నారు. బోనాల పండుగతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
Post Views: 24








