ఆదిలాబాద్, మహా
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే చేపట్టాలని పి ఆర్ టీ యూ టీ ఈ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్ డిమాండ్ చేశారు. సంఘం
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్బంగా కృష్ణ కుమార్ మాట్లాడుతూ
ఉపాధ్యాయుల ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటు అయినటువంటి సంఘం ఎన్నో జీవోలను సాధించి ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పించ్చిందని తెలిపారు. ప్రతినిత్యం ఉపాధ్యాయుల సమస్యల సాధన కై నిరంతరం పాటుపడుతున్నటువంటి ఏకైక అతిపెద్ద సంఘమని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు చెల్లించడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఏస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేసి పిఆర్సి ప్రకటించాలని కోరారు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డులు వర్తించేటట్లు త్వరలో ఉత్తర్వులు విడుదల చేయాలని అన్నారు. 2024 సంవత్సరం నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెన్యూమరేషన్ విడుదల చేయాలని తెలిపారు.
317 జీ ఓ బాధితులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని సమగ్ర శిక్షలో, ఐటీడీఏలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు, సీఆర్టీలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నరసింహ స్వామి, అదిలాబాద్ అర్బన్ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పిల్లి కిషన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ ప్రశాంత్, జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షరాలు సులోచన రాణి, మండల మహిళా అధ్యక్షురాలు అరుణ పాల్గొన్నారు.








