Mahaa Daily Exclusive

  అర్జీలను తక్షణమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

Share

ఆదిలాబాద్, మహా

ప్రజల నుంచి అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా అయన ప్రజావాణి లో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు.. వాటి పరిష్కారం పై అధికారులతో చర్చించారు. సీఎం ప్రజావాణి లో వచ్చిన వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని సూచించారు.ప్రత్యేక అధికారులు రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్ కు వెళ్లి రోజువారీ మెనూ అమలుపై తెలుసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ లు పరిశీలించి ఉపాధ్యాయులు సక్రమంగా బడికి వెళ్తున్నారో లేదో తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం పై ఆరా తీయాలని తెలిపారు. అనంతరం పరిశ్రమలు వాణిజ్య శాఖల ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సెంజ్ తెలంగాణ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవి, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా తదితరులు పాల్గొన్నారు.

Latest