ఆదిలాబాద్, మహా
బిసి- ఏ కేటగిరీలో ఇతర కులాలను చేర్చి గంగపుత్రులను అన్యాయం చేసేలా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎల్లుల భోజన్న డిమాండ్ చేశారు. బిసి ఏ లో కొత్తగా ముదిరాజ్ లతో పాటు మరిన్ని కులాలను చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దీని వల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్న తమకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ ప్రయత్నాలను విరమించుకోలేని పక్షంలో గతంలో తమకు ఇచ్చిన హామీ మేరకు గంగపుత్రులను ఎస్టీ కేటగిరీలో చేర్చాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సంఘం నాయకులుమేకల అశోక్, నగేష్, అజయ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 110








