Mahaa Daily Exclusive

  విద్యార్థిని బూటు కాలుతో తన్నిన హెడ్ మాస్టర్ గోవింద్ కఠినంగా శిక్షించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి విద్యార్థి సంఘాల నాయకులు తల్లిదండ్రులు ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

ఈనెల 11న షాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. విద్యార్థిని చితకబాది, బూటు కాలితో తన్నిన హెడ్మాస్టర్ గోవింద్ పై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన షాబాద్ గ్రామ ప్రజలు. అయినా అతని రీతిలో మార్పు రాకపోవడం గమనార్హం అని స్థానికులు వాపోతున్నారు. నా స్కూల్ నా ఇష్టం నువ్వు ఎవరు మాట్లాడడానికి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగినట్లు షాబాద్ గ్రామం ప్రజలు తెలిపారు.

మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేస్తాం…
పిడిఎస్యు విద్యార్థి సంఘం నాయకులు రాజేష్ పాఠశాలను సందర్శించి జరిగిన ఘటనపై విద్యార్థిని అడిగి విషయం తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల హెడ్ మాస్టర్ గోవింద్ తీరే వేరుగా ఉంది. ఈనెల 11న 6వ తరగతి విద్యార్థి మరో విద్యార్థి కలిసి గొడవ పడుతున్న తరుణంలో మరో విద్యార్థి వెళ్లి హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేయగా, అతను వచ్చి రాకేష్ అనే విద్యార్థిని ఇష్టం వచ్చినట్లు చితకబాది, కింద పడేసి బూటు కాలుతో తొక్కుతూ, దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగిందని విద్యార్థి సంఘం నాయకులు రాజేష్ అన్నారు. ఇంతటి దారుణానికి ఓడిన హెడ్ మాస్టర్ గోవింద్ ను కఠినంగా శిక్షించి వెంటనే విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, హెడ్మాస్టర్ గోవింద పై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. షాబాద్ లో జరిగిన సంఘటనపై త్వరలో మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు.

Latest