Mahaa Daily Exclusive

  అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఆకస్మికంగా భోజనాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి…!

Share

దమ్మపేట ,జూలై 16 మహా :
మండలంలోని అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ను రాష్ట్ర రెవిన్యూ ,గృహ ,పౌరసంబంధాల సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాల లో విద్యార్ధులకు వడ్డిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అదే విదంగా పాఠశాల లో విద్యార్థుల తో కొద్ది సేపు ముచ్చటించారు. మెనూ తదితర అంశాలపై ,వాటర్ ప్లాంట్ విషయమై ఆరా తీశారు. పాఠశాల లో ఉపాధ్యాయ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేందుకు వారికి క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన ప్రణాలికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. క్వార్టర్స్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. గత విద్యాసంవత్సరానికి పదవ తరగతి లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల లో ఐటిడిఎ ద్వారా మంజూరు చేసిన టేబుల్ టెన్నీస్ ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి ప్రారంభించారు. ఐటిడిఎ పి.వో రాహుల్ విద్యార్థుల కు వండిన వంటలను స్వయంగా స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తో పాటు పాఠశాల ప్రాధాన ఉపాధ్యాయులు శారద ,పిఇడి నాగమణి ,ఉపాధ్యాయ సిబ్బంది ,ఏయంసి చైర్మన్ వాసం రాణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest