Mahaa Daily Exclusive

  మధిర మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన రాష్ట్ర, జిల్లా కోఆర్డినేటర్స్..!

Share

మధిర,జూలై16(మహ):
మధిర వ్యవసాయ మార్కెట్ కార్యాలయములో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావుతో కలిసి సంబంధిత అధికారులు,రాష్ట్ర, జిల్లా పరిశీలకులు ధాన్యం కొనుగోళ్ళ సమయంలో జరుగుతున్న ఇబ్బందుల విషయమై చర్చించినారు.
ఖరీఫ్,రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కావాల్సిన యంత్ర పరికరాలు సకాలంలో అందుతున్నాయా,లేదా అన్న అంశంపై రాష్ట్ర కోఆర్డినేటర్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.సి.మల్లయ్య,జిల్లా కోఆర్డినేటర్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ బీ.ఎన్.రావు మరియు జిల్లా కోఆర్డినేటర్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.గణేష్ మధిర వ్యవసాయ మార్కెట్ లో ఉన్న ప్యాడీ క్లీనర్లు, వినోఇంగ్ ఫ్యాన్స్,తేమ శాతం నిర్ధారణ యంత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలను పరిశీలించానారు.ఆ తర్వాత మార్కెట్ కార్యాలయంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బండారు నరసింహారావు అధ్యక్షతన సొసైటీల సీఈఓలు, ఐకేపీ,మార్కెట్ ఉద్యోగులతో పాటు రైతులతో సమావేశమై కొనుగోళ్ల కేంద్రాలలో కల్పించిన సౌకర్యాలు,అందిన పరికరాలపై ఆరా తీయడంతో పాటు ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరమా అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, యస్.ఏం.ఏ ఏం.రామకృష్ణ, మధిర మార్కెట్ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి,మార్కెట్ కమిటీ కార్యదర్శి కే. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Latest