భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (మహా):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని చింతలతండా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న భానోతు తరుణ్ ప్రమాదవశాత్తు గత ఎనిమిది నెలల క్రితం విద్యుత్ షాక్ తో మరణించాడు. మరణించిన తరుణ్ సతీమణి అనూషకు బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో ఆ శాఖ ఎడిఇ రవికుమార్ 4 లక్షల 50 వేల రూపాయలు విలువ గల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎఇ నరసింహారావు, ప్రవీణ్, చింతలతండా మాజీ సర్పంచ్ రాములు, సుబ్బారావు, వీరన్న పాల్గొన్నారు.
Post Views: 20








