కారేపల్లి, మహా : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ఇందిరమ్మ సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఓటు అడిగే హక్కు ఉందని డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయటానికి బుధవారం కారేపల్లిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించిన బీఆర్‌ఎస్‌ను ఎన్నికలలో ఓటు దెబ్బకొట్టాలని ప్రజలను కోరారు. ప్రజలకు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పధకాలు కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించి ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదని కొనియాడారు. స్ధానిక ఎన్నికలలో కార్యకర్తలు కలిసి కట్టుగా పార్టీ అభ్యర్ధులకు పట్టం కట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు యడ్లపల్లి సంతోష్, దొబ్బల సౌజన్య, పగడాల మంజుల, బానోత్ రాంమూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీరప్రతాప్, గుగులోత్ భీముడు, గుగులోత్ శ్రీను, బానోత్ హీరాలాల్, ఎండీ.యాకూబ్‌అలీ, దారావత్ భద్రునాయక్, గడ్డం వెంకటేశ్వర్లు, అడ్డగోడ ఐలయ్య, బానోత్ దేవ్లానాయక్, మల్లెల నాగేశ్వరరావు, ఆలోత్ ఈశ్వరీనందరాజ్, గుగులోత్ హర్షానాయక్ , మేదరి రాజా,తదితరులు పాల్గొన్నారు.








