కారేపల్లి, మహా : కారేపల్లి మండలం మాణిక్యారరాఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ పోడు లో పోడుదారులు, ఫారెస్టు అధికారుల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. పోడులో పోడుదారులు వేసుకున్న గుడిసెలను తొలగించే క్రమం ఇరువర్గాల మధ్య తోపులాట, నెట్టుకోవటం చోటుచేసుకుంది. మహిళలను చూడకుండా ఫారెస్టు అధికారులు మహిళ పోడుదారులపై దాడికి దిగారు. అదే స్ధాయిలో పోడుదారులు ప్రతిఘటించారు. ఐదేండ్లుగా ప్లాంటేషన్ పోడు సమస్య ఫారెస్టు అధికారుల నాన్చుదోరణితో జఠిలం అయింది. ప్రత్యామ్నాయ పోడు చూపుతామని 2020లో ప్లాంటేషన్ కోసం 50 హెక్టార్ల పోడును 60 మంది పోడుదారుల నుండి సేకరించారు. పోడు నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా దాటవేత ద్రోరణి అవలంభిస్తుండటంతో మూడేండ్లుగా ప్లాంటేషన్ పోడులో ఉద్రిక్తత పరిస్ధితిలు నెలకొంటున్నాయి. ఈ ఏడాది సైతం పోడుదారులు పోడులో విత్తనాలు వేసి అక్కడే గుడెసెలు వేసుకోని ఉంటున్నారు. దీనిపై ఎఫ్‌డీవో సైతం ఆప్రాంతాన్ని సందర్శించి ఐదు రోజులలో దానిపై నిర్ణయం తీసుకుంటాని తెల్పారు. అయినా ఎటువంటి చర్యలు లేక పోవటంతో పోడుదారులు ప్లాంటేషన్ పోడు సాగుకు ఉపక్రమించారు.
చర్చలకు పిలిచి గుడిసె పీకేయత్నం
పారెస్టు అధికారులు పోడుదారులను, ప్రజాసంఘాల నాయకులను ఎఫ్‌డీవో చర్చలకు పిలిచారు. చర్చలకు ప్రజాసంఘాల నాయకులైన కే.నరేంద్ర, వజ్జా రామారావు, మాలోత్ శోభన్‌నాయక్ లు పోడు వద్దకు వచ్చారు. పోడుదారులతో చర్చలు చేయకుండానే ఎఫ్ఆర్వో వెంకట్ నాయక్, ఎఫ్ఎస్వో లు చక్రవర్తి, వీరభద్రం ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులు ప్లాంటేషన్‌కు చేరుకోని అక్కడి ఉన్న గుడిసెను తీసివేయాలని డిమాండ్ చేయటంతో పాటు దానిని పీకటంతోపాటు అరక వస్తువులను ధ్వంసంకు ప్రయత్నించటంతో మహిళా పోడుదారులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. మల్లమ్మ అనే మహిళలను ఫారెస్టు అధికారులు నెట్టివేయటంతో ఘర్షణ జరిగింది. మహిళలని చూడకుండా మగ ఫారెస్టు అధికారులు దౌర్జన్యం చేశారు. అదే స్ధాయిలో పోడుదారులు ఎదురించి నిలిచారు. ప్రజాసంఘాల నాయకులు కే.నరేంద్ర, వజ్జా రామారావు, మాలోత్ శోభన్ లు ఘర్షణను నివారించే ప్రయత్నం చేసినా ఫారెస్టు అధికారులు మొండిగా వ్యవహరించి మహిళలపై దౌర్జ్యంకు దిగారు. పోడులో ఘర్షణ విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్సై బీ.గోపి సంఘట స్ధలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. విషయాన్ని ఫారెస్టు డివిజన్ అధికారి దృష్టికి తీసుకెళ్ళారు. సమస్య పరిష్కారంకు రెండు రోజుల గడువు కోరారు. అప్పటి వరకు ఇరు వర్గాలు ఆ ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎస్సై గోపి సూచించారు. దీంతో ఇరువర్గాలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీనిపై ఇరువర్గాలు కారేపల్లి పోలీసులకు పిర్యాదులు చేసుకున్నారు.








