ఆదిలాబాద్, మహా
ఉద్యానవన పంటల సాగుకు జిల్లాలో అనువైన నేలలు ఉన్న నేపథ్యంలో పంటల సాగుపై ఆసక్తి పెంపొందించుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ ప్రిన్సిపాల్, సీనియర్ శాస్త్రవేత్త మురళి సూచించారు. ఉద్యావన యూనివర్సిటీలో ఎస్సీ రైతులకు ఉద్యానవన పంటలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం తొలి రోజున తెలంగాణ హెడ్ డాక్టర్ మహేందర్ ముఖ్య అథితిగా హాజరై పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పంట వేసిన నాటి నుండి చేతికందే వరకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. ఎటువంటి అవసరమున్నా ఉద్యానవన యూనివర్సిటీ లో సంప్రదిస్తే తగు సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మురళి మాట్లాడుతూ.. గ్రామీణప్రాంతాల్లోని రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించేల శిక్షణాలు ఇస్తున్నామన్నారు. రైతులు కూడా ఉద్యానవన పంటలపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన నెలలుకూడా ఉన్నాయని తెలిపారు. రైతులు రెండు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు రోజుల్లో రోజుకు 150 చొప్పున శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఉట్నూర్ ఉద్యానవన అధికారి సందీప్, ఏఈఓ లు శ్రీనివాస్, ఇర్ఫాన్, రైతు సంఘం నాయకులు చిలుక దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.








