Mahaa Daily Exclusive

  కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరగా చేపట్టాలి కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరం
27 డివిజన్ లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సమీపంలో గల సర్వే నంబర్ 9, ప్లాట్ నెంబర్ 63 లో గల స్థలాన్ని స్థానిక డివిజన్ చింతాకుల అనిల్ కుమార్ ఆహ్వానం మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్ రవీంద్ర రడేకర్, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ అధికారులకు వివరిస్తూ ఈ స్థలం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ వారి కబ్జాలో ఉండగా కొందరు వ్యక్తులు వారి వ్యక్తిగత స్వార్థం కొరకు ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చూడగా కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భాష పాక సదానందం తో కలిసి స్థలానికి సంబంధించిన సరైన పత్రాలను అధికారులకు చూపించి ఎట్టి పరిస్థితుల్లో దళిత బహుజనులకు ఉపయోగపడే విధంగా ఈ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే వారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని 50,00000 అక్షరాల యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ స్థలాన్ని 27 డివిజన్లో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కేటాయించిన ఫండ్ తో కమ్యూనిటీ హాల్ ను నిర్మాణం చేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి వివరించారు.
ఈ కార్యక్రమంలో టీ పి ఓ ఖలీలుద్దీన్, టిపిఎస్ నరేందర్, టిపి ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీసాల ప్రకాష్, నాయకులు కొమ్ము రాజకుమా,ర్ మంద శ్రీను, విశాల్, సుధాకర్ ,రాజేష్, మహేష్, రవి ,సాగర్, చారిభాయి ,అమర్ ,రమేష్, విజయ్ ,తదితరులు పాల్గొన్నారు.

Latest