Mahaa Daily Exclusive

  మంచి ఆరోగ్యానికి పోషకాహారం తీసుకోవాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..!

Share

హన్మకొండ మహా;

క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మనుస్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ వారి సహకారంతో 20 న్యూట్రిషియన్ కిట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా టీబీ పేషంట్ల కు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి తో బాధపడే వారు సమయాను కూలంగా మందులను వేసుకోవాలని, అలాగే చక్కటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి నుండి త్వరగా కోలుకుంటారని అన్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని వారికి చికిత్స సమయంలో పోషణ సహకారంను అందించినట్లయితే సమాజంలో క్షయ వ్యాధిని నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ డిఎంహెచ్వో అప్పయ్య, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు, మాస్ మీడియా అధికారి అశోక్, ప్రసన్నకుమార్, మనుస్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ మహేష్,జిల్లా టిబి కోఆర్డినేటర్లు సుష్మ , నగేష్, సూపర్వైజర్ విజయ్ హెల్త్ విజిటర్ అంజమ్మ సునీత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest