కాటారం, మహా : యువతీ, యువకులు మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సిఐ రామచందర్రావు అన్నారు. బుధవారం మహాదేవపూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సిఐ రామచంద్రరావు మహాదేవపూర్ మండలం లోని 8 మంది గంజాయి కన్స్యూమర్స్ యువకులకు కౌన్సిలింగ్ చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. నిషేధిత గంజాయి వినియోగించిన రవాణా చేసిన, విక్రయాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమం లో భాగంగా, భూపాలపల్లి ఎస్ పి కిరణ్ ఖరే ఆదేశాల మేరకు బుధవారం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో సి ఐ, మహాదేవపూర్ ఎస్ ఐ ఆధ్వర్యంలో పి. ఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో ఎస్. ఐ కే పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 29








