Mahaa Daily Exclusive

  ఆరుట్ల గ్రామంలో చురుకుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహ:
ఆరుట్లలో చురుగ్గా కొనసాగుతున్న ఇండ్ల నిర్మాణాలు. మంగళవారం మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా, స్లాబ్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసిన రావుల మహేష్, ఇల్లు నిర్మాణ పనులను ఇందిరమ్మ కమిటీ సభ్యులతో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి కలిసి పరిశీలించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో అందించడం జరుగుతుందని కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుట్టి కృష్ణ, మార లక్ష్మణ్, కంబాలపల్లి బుగ్గరాములు, కోరే బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార సురేష్, చిందం ఐలయ్య, ఆర్ల మల్లేష్, ఆర్ల శ్రీకాంత్, చీమర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest