రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నాబార్డు 44వ వ్యవస్థాపక దినోత్సవము సందర్భంగా మంగళవారం నాబార్డు తెలంగాణ రీజినల్ కార్యాలయం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు హాజరై, నాబార్డ్ సేవలను అభినందిస్తూ, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన సంస్థల పాత్రను ప్రశంసించారు. అత్యుత్తమ పనితీరు కనబరచిన పిఎసిఎస్ సంఘాలకు అవార్డులను అందజేశారు. నాబార్డ్ సిజిఎం బి. ఉదయ భాస్కర్, TGCAB చైర్మన్ ఎం. రవీందర్ రావు, RCS సురేంద్ర మోహన్ IAS, NOFSCAB చైర్మన్ కె. రవీందర్ రావు సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… జిల్లాలోని రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్న పిఎసిఎస్ సంఘాలు చాలా సంతోషమని సంఘాల చైర్మన్లను సీఈఓలను అభినందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు కావలసిన సదుపాయాలను కల్పిస్తూ, తెలంగాణ ప్రభుత్వం రైతులకు సహకరిస్తుందని ఆయన తెలిపారు. తుర్కయంజాల్ రైతు సంఘం ద్వారా గోదాముల నిర్వహణ, లాకర్ల సదుపాయము, రైతులకు నాణ్యమైన ఎరువుల సరఫరా, వ్యవసాయ, వ్యవసాయేతర ఆర్ధిక సేవలు, సంఘాల ఆధ్వర్యములో చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, సంఘము పనితీరు కనబరిచినందుకు గాను, ఉత్తమ ప్రతిభావంతమైన సంఘముగా భావించి, తుర్కయంజాల్ పిఎసిఎస్ సంఘ అధ్యక్షులు, DCCB చైర్మన్, TGCAB వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యకు, సంఘ సీఈవో వై. రాందాస్ కు అభినందనల సర్టిఫికెట్, మెమెుంటో అందజేయడం జరిగింది.
డిసిసిబి చైర్మన్ మాట్లాడుతూ… ది తుర్కయాంజల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు అందించిన సేవలను గుర్తించిన, అత్యుత్తమైన నాబార్డ్ సంస్థ, అభినందనలు తెలిపినందుకు చాలా సంతోషమని అన్నారు. రైతుల కోసం రైతు సేవలో మరింత కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లాలోని పిఎసిఎస్ సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సీఈవోలు, డిసిసిబి అధికారులు పలువురు పాల్గొన్నారు.








