మంచిర్యాల, మహా : మంచిర్యాల
జిల్లా నిరుద్యోగ యువతకు మైనార్టీ సంక్షేమశాఖ – తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్-హైదరాబాద్ ద్వారా ఉచిత శిక్షణ-ఉపాధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలలో శిక్షణ ఉపాధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన నిరుద్యోగ మైనార్టీ (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ) యువత ఈ నెల 18వ తేదీ నుండి ఆగస్టు 18 వరకు అవసరమైన డాక్యుమెంట్లతో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయం / హైదరాబాద్ లోని టి.జి.ఎం.ఎస్.సి. కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి కాలం గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ (డిస్టెన్స్ విద్య అంగీకరించబడదు) చేసి ఉండాలని, గ్రాడ్యుయేషన్లో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలని, 26 సం॥ల లోపు వయస్సు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు గూగుల్ ఫామ్ https://forms.gle/oAa8kToUSz3XvDvcA లో / జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చని, వివరాలకు 040-23236112, ఈ-మెయిల్ directormsccctelangana@gmail.com లో కార్యాలయ పని వేళలు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.








