Mahaa Daily Exclusive

  జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా చంద్రయ్య ..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పి చంద్రయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా
కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. చంద్రయ్య గతంలో వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) ను జిల్లా పౌరసంబంధాల అధికారి యం కృష్ణమూర్తి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.