Mahaa Daily Exclusive

  కూరగాయల మార్కెట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం…!

Share

ఖమ్మం సిటీ, మహా.
ఖమ్మం నగర కూరగాయల మార్కెట్‌లో రిటైల్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఆహ్లాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, ఇంటక్ నగర ఉపాధ్యక్షుడు ఎం.డి. ఫజల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సమ్మేళనానికి ఇంటక్ నగర అధ్యక్షుడు నరాల నరేష్ మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షుడు, యర్రగర్ల హనుమంతరావు, తల్లాడ రమేష్, ఇంటక్ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, అష్రీఫ్ మొహమ్మద్, కార్పొరేటర్ రాపర్తి శరత్, బాణాల లక్ష్మణ్, ఆటో యూనియన్ జిల్లా నాయకుడు పాల్వంచ కృష్ణ, మార్కెట్ సెక్రటరీ ఆంజనేయులు, మిషన్ భగీరథ మండలి అధ్యక్షుడు తలారి రాములు తదితరులు హాజరయ్యారు.

వచ్చిన అతిథులను గజమాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. సమావేశంలో కూరగాయల మార్కెట్ సమస్యలు, అవసరమైన సదుపాయాలపై చర్చించి, అధికారులకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మార్కెట్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Latest