Mahaa Daily Exclusive

  ముందు అన్యమతస్థులకు ఇచ్చిన భూమిని స్వాదీనం చేసుకోండి రైతులపై దాడులుచేస్తే సహించం సాదుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ..!

Share

మహా భద్రాచలం

వివాదాస్పదంగా ఉన్న భద్రాద్రి రామాలయం భూములను ఆనందాశ్రమ పీఠాధిపతి, సాధు పరిషత్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ పరిశీలించారు. అనంతరం పురుషోత్తమపట్నం గ్రామస్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
దేవాదాయ శాఖ అధికారులు నిత్యం రామున్ని దూషించే అన్యమతస్థులకు 12 ఎకరాలు రామాలయ భూమిని ఎలా కేటాయుంచారని ప్రశ్నించారు. ముందుగా ఆ భూమిని రామాలయం అధికారులు స్వాదీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలతో సాదుపరిషత్ మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, పురుషోత్తమపట్నం రైతులతో కమిటీలు వేసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, అంతే గాని అధికార దర్పంతో రైతులపై దాడులు నిర్వహిస్తే సాధు పరిషత్ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సాదుపరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వ్యాఖ్యలను పలువురు స్వాగతిస్తున్నారు.ముందుగా స్వామీజీ భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం పురుషోత్తమపట్నం వెళ్లారు. అక్కడ గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Latest