AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ప. గో జిల్లాలో పర్యటించిన ఆయన.. వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాట తీస్తామని, తోలు తీస్తామని, మక్కెలు ఇరగగొడతామంటే ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని, చేతకాని వాళ్లం కూడా కాదని వార్నింగ్ ఇచ్చారు. చట్టంపై గౌరవం ఉన్నందునే ఆగుతున్నామని చెప్పారు.
Post Views: 53








