AP: మెగా DSC తుది ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 20లోగా 16,500 మంది కొత్త టీచర్లు బడులకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఒక్క టీచరుని నియమించకుండా, స్కూళ్లలో బాగా చదువు చెప్పామని వైసీపీ గొప్పలు చెప్పుకుందని చంద్రబాబు విమర్శించారు. తాము చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే మొదటి సంతకం MEGA DSCపై పెట్టామన్నారు.
Post Views: 69








