Mahaa Daily Exclusive

  పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల బీభత్సం ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఆటోలు పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో ఆటో అడ్డా పేరుతో డ్రైవర్లు ట్రాఫిక్కు అంతరాయం కలిగించడమే కాకుండా స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దేశాయ్ పేట్ నడిరోడ్డు పైనే విచ్చలవిడిగా ఆటోలు నిలుపుతూ స్థానిక వ్యాపారస్తులను బెదిరిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. నడిరోడ్డుపై ఆటోలు నిలిపి మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడటం, మద్యం సేవించడం ట్రాఫిక్ నిబంధనలు బేఖాతర్ చేసిన, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న లాండ్ అండ్ ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరు. నగరం నుండి ఈ దారిలో అనేక పోలీసు అధికారుల వాహనాలు పెట్రోలింగ్ చేసిన ఎటువంటి ఫలితం లేదు. గత కొంతకాలంగా ఆటో డ్రైవర్లకు ఎటువంటి సూచనలు, కౌన్సిలింగ్ చేయకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ద్వారా మందలించి ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest