మిర్యాలగూడ మహా
శాసనసభ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండల శివారులోని దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పథకం పనులపై ఆరా తీశారు. పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు చివరి భూములు సుమారు 12,236 ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంగా పథకం ప్రారంభించామని, ఆలస్యం చేయకుండా పూర్తి చేసి రైతులకు అందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ లున్నారు.
Post Views: 62








