Mahaa Daily Exclusive

  పట్నంలో మత్తును ఆస్వాదిస్తున్న యువత..? గంజాయా లేక సేవించేది సిగరెటా..? ధూమపానంతో విద్యార్థులు పెడదారి. పట్టించుకునే నాధుడే కరువయ్యారు..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
బహిరంగ ప్రదేశంలో విచ్చలవిడిగా ధూమపానం సేవిస్తున్న సంఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మాదక ద్రవ్యాలను అదుపు చేయాలని ఆదేశాలు జారీ చేసినా, ఇబ్రహీంపట్నంలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా, ఆదేశాలను బేకాతరు చేస్తూ, బహిరంగ ప్రదేశాలలో విచ్చలవిడిగా ఇంజనీరింగ్ విద్యార్థులు ధూమపానం సేవిస్తూ మత్తుకై చిత్తవుతున్నారు.

వివరాల్లోకి వెళితే……
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని, పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని పలు టీ పాయింట్ల వద్ద, యువత సిగరెట్లు తాగుతూ చెడు దారిన పడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా ప్రైవేట్ హాస్టల్స్ ఉండడంతో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు, సాయంత్రం వేళ సుమారు 18 సంవత్సరాల నిండని విద్యార్థులు ధూమపానం సేవిస్తూ, పక్కన కూర్చున్న ఇతరులకు పొగ కారణంగా ఇబ్బంది చేకూరుతున్న, పట్టించుకునే నాధుడే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధం…
బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధం ఉన్నప్పటికీ, టీ పాయింట్ల వద్ద సిగరెట్లను విచ్చలవిడిగా విక్రయించడంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు ధూమపానం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బందులను కలిగిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి ధూమపాన నిర్మూలనకు పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు. బహిరంగ ప్రాంతాలలో ధూమపానం సేవించే యువతపై జరిమానా విధించి, భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కట్టడి చేయాలని కోరారు.

పోలీస్ అధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలి….
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉండడంతో ప్రైవేట్ హాస్టల్లోని విద్యార్థులు సాయంత్రం వేళ కాలక్షేపానికి వచ్చి దురాలవాట్లకు పాల్పడుతున్నారు.
పోలీస్ అధికారులు నిఘా పెట్టి ధూమపానాన్ని అదుపు చేయాలని ప్రజలు కోరుచున్నారు.
సిగరెట్ల రూపంలో కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు రహస్యంగా గంజాయి కూడా సేవిస్తున్నట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Latest