Mahaa Daily Exclusive

  వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్పోరేటివ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పవిత్రం శ్రీనివాస్..!

Share

కాటారం, మహా: భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన పవిత్రం శ్రీనివాస్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కార్పోరేటివ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ గా అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ నియమించారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నగరంలో ఆదివారం జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అర్థ సంవత్సర సమావేశంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో అత్యుత్తమ సేవలందించినందుకు ప్రమోషన్ ఇచ్చినట్లు ప్రకటించారు. మే నెలలో కాళేశ్వరంలో జరిగిన సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా మహన్నదానం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్లా రామకృష్ణ వెండి మెమెంటో బహుకరించి సన్మానం చేశారు. పవిత్రం శ్రీనివాస్ కు అత్యున్నత పురస్కారం లభించడం పట్ల మండల ఆర్యవైశ్యలు, వాసవి క్లబ్ నాయకులు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.