Mahaa Daily Exclusive

  భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లి బోనాలు… అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
ఆదివారం చేవెళ్ల పట్టణంలో పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని, అమ్మ వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల శాసనసభ్యులు *”కాలే యాదయ్య”. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. పట్టణంలోని వివిధ కాలనీలో పట్టణవాసులు పోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించి మోక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.